దేశంలో కొత్తగా 98వేల పాజిటివ్ కేసులు! - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కొత్తగా 98వేల పాజిటివ్ కేసులు!

September 17, 2020

uh

దేశంలో గడిచిన 24 గంటల్లో 97,894 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 51,18,253కి చేరింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,132 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 83,198కి పెరిగింది. అలాగే నిన్న 82,719 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించి వారి సంఖ్యా 40,25,079కి చేరింది. 

ప్రస్తుతం దేశంలో 10,09,976 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,36,613 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 6 కోట్ల 5 లక్షల 65,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించింది. దేశంలో ఆదిత్యధికంగా మహారాష్ట్ర(11,21,221) మందికి కరోనా సోకింది. కరోనా కేసుల్లో ఆంధ్రప్రదేశ్(5,92,760) రెండవ స్థానంలో కొనసాగుతోంది.