1000 నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి - MicTv.in - Telugu News
mictv telugu

1000 నోట్లలో 99 శాతం తిరిగొచ్చాయి

August 30, 2017

గత ఏడాది నవంబర్లో రద్దు చేసిన రూ. 1000 నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి ఆర్బీఐకి చేరుకున్నాయి. అయితే రూ. 8900 కోట్ల విలువైన వెయ్యి నోట్లు తమకింకా చేరలేదని బ్యాంకు  వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటి వివరాలతో రూపొందించిన బ్యాంకు వార్షిక నివేదిక ప్రకారం..

గత ఏడాదితో పోలిస్తే చలామణిలో ఉన్న ద్రవ్యం విలువ 20 శాతం తగ్గి రూ. 13 లక్షల కోట్లకు పడిపోయింది.  కొత్తగా తీసుకొచ్చిన రూ. 2 వేల నోట్లు మొత్తం నోట్లలో 50 శాతానికిపైగా ఉన్నాయి. 7.2 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారు. నోట్ల ముద్రణ వ్యం రూ. 3,421 కోట్ల నుంచి రెండింతలు పెరిగి రూ. 7965 కోట్లకు చేరింది. గత ఏడాది నవంబర్ లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసి కొత్త రూ. 500, రూ. 2000 నోట్లను తీసుకురావడం తెలిసిందే.