తెలంగాణలో నేడు 99 కేసులు.. 92కు చేరుకున్న మృతులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నేడు 99 కేసులు.. 92కు చేరుకున్న మృతులు

June 2, 2020

m bmn

వాతావరణం చల్లబడిందిగా.. ఇంకే పండగే అన్నట్టుంది కరోనా వైరస్ తీరు చూస్తుంటే. ఉష్ణోగ్రతలు తగ్గితే కరోనా మరింత రెచ్చిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో తాజాగా 99 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు, మహబూబ్ నగర్‌లో 1, మేడ్చల్ 3, జగిత్యాల 1, నల్గొండ 2, మంచిర్యాల 1, సంగారెడ్డి 1, సిద్దిపేట్ 1, వలస కార్మికులలో 12 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కరోనాతో నేడు నలుగురు మృతిచెందగా.. మృతుల సంఖ్య 92కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,526కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,891కి చేరుకుంది. 1,273 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఇదిలావుండగా పాతబస్తీలోని శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగౌస్ హోటల్‌లో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుస్తోందని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హోటల్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. హోటల్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని శాలిబండ పోలీసులకు అప్పగించారు.