నిర్మాతగా ఏఆర్ రెహమాన్.. 99 సాంగ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

నిర్మాతగా ఏఆర్ రెహమాన్.. 99 సాంగ్స్

April 12, 2019

సంగీతానికి మారుపేరుగా మారిన ఏఆర్ రెహమాన్ ఎన్నో మంచి మంచి పాటలను అందించారు. సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆయన నిర్మాతగా అవతారం ఎత్తారు. ఆయన నిర్మాత అయ్యారంటే ఆ సినిమా కథ ఎలా వుంటుందో ముందే ఊహించవచ్చు. సంగీత ప్రధానంగా సాగే సినిమా కథ ఇది. ఈ సినిమాకు ’99 సాంగ్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గాయకుడిగా రాణించడానికి ఓ యువకుడు చేసిన ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

99 Songs: AR Rahman to make debut as writer, producer with film, starring Lisa Ray, Manisha Koirala

విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి ఈ ఏడాది జూన్ 21వ తేదీన ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. సంగీతమే ప్రధానంగా సాగే ఈ సినిమాలో మనీషా కొయిరాలా, లీసారే, ఎహాన్ భాట్, ఎడిల్సి వెరగాస్, థామస్ ఆండ్ర్యూస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.