మూడేళ్ళుగా టాయ్‌లెట్‌లో జీవిస్తున్న గిరిజన మహిళ.. - MicTv.in - Telugu News
mictv telugu

మూడేళ్ళుగా టాయ్‌లెట్‌లో జీవిస్తున్న గిరిజన మహిళ..

December 10, 2019

toilet01

దేశంలో స్వంత ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొని వచ్చినా వాటి ప్రయోజనాలు పేద ప్రజలకు అందడం లేదు. ఇంకా లక్షల్లో కుటుంబాలు అద్దె ఇళ్లలో, గుడిసెల్లో జీవితం వెళ్లదీస్తున్నారు. ఒడిశాలోని 72 ఏళ్ల గిరిజన మహిళ ఉండటానికి ఇల్లు లేక మూడేళ్ళుగా మరుగుదొడ్డిలో జీవిస్తుండడం ఇందుకు నిదర్శనం. 

మయూరభంజ్ జిల్లా వాసి అయిన ద్రౌపది బెహెరా తన నలుగురు కూతుళ్లతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో నివాసముంటుంది. భర్త చనిపోయిన తరువాత..అత్యంత పేదరికంతో ద్రౌపది టాయిలెట్‌లో జీవించాల్సిన దుర్భర దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగుతున్న ఈ క్రమంలో తన ఆడబిడ్డలకు ఈ మరుగుదొడ్డి ఎంతవరకూ రక్షణనిస్తుంది అని ఆందోళన చెందుతోంది. వేరే మార్గం లేక మరుగుదొడ్డిలోనే జీవిస్తోంది. దీని గురించి గ్రామా సర్పంచ్ బుధురామ్ పుటీ మాట్లాడుతూ..ఆమె పరిస్థితి చాలా దారుణమైనది. ఆమెకు ఓ ఇల్లు నిర్మించేంత స్తొమత తమ పంచాయితీకి లేదు. ప్రభుత్వం ఏదైనా పథకం ద్వారా ఆమెకు ఓ ఇల్లు కేటాయిస్తే కట్టిస్తాము’ అని తెలిపారు.