పొరపాటున కోటీశ్వరురాలైన మహిళ.. దెబ్బకు 75 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

పొరపాటున కోటీశ్వరురాలైన మహిళ.. దెబ్బకు 75 కోట్లు

April 8, 2022

money

దీన్ని అదృష్టం అనాలో, కర్మఫలం అనాలో అర్థం కావట్లేదు. ఓ మహిళ అనుకోకుండా లాటరీ తగిలి కోటీశ్వరురాలైపోయింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లాక్వెడ్రా ఎడ్వర్డ్స్ అనే మహిళ స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్‌లో లాటరీ కొనాలని నిర్ణయించుకొని వెండింగ్ మెషీన్ వద్దకు వెళ్లింది. లాటరీ టికెట్ సెలెక్ట్ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఈమెను గుద్దేసి వెళ్లిపోయాడు. దాంతో మెషీన్ మీద పడ్డ మహిళ.. పొరపాటున తాను కోరుకున్న టిక్కెట్ కాకుండా వేరే టిక్కెట్ నొక్కేసింది. అంతేకాక, ఆ వేరే టిక్కెట్టుకు అదనంగా డబ్బు చెల్లించాల్సి వచ్చింది. దాంతో ఢీకొట్టిన వ్యక్తిని మనసులో తిట్టుకుంటూ వచ్చిన టిక్కెట్ తీసుకొని ఇంటిబాట పట్టింది. కొద్ది రోజుల తర్వాత ఫలితాలను ప్రకటించినప్పుడు లాక్వెడ్రా కొన్న టిక్కెటుకే లాటరీ తగిలింది. రూ. 75 కోట్లను లాక్వెడ్రా గెలుచుకుంది. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘మొదట నేను నమ్మలేదు. లాటరీ తగిలినప్పుడు టిక్కెటునే చూస్తూ ఉండిపోయా. ఇప్పటికీ షాకులోనే ఉన్నా. ఈ డబ్బుతో ముందు ఓ ఇల్లు కట్టుకుంటా. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఏదైనా సేవా కార్యక్రమం కోసం ఓ సంస్థను ప్రారంభిస్తా’నని ఆనందం వ్యక్తం చేసింది.