A bear came to a wedding and drank coffee in tamilnadu
mictv telugu

పెళ్లికి వచ్చి కాఫీ తాగి వెళ్లిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

September 2, 2022

ప్రపంచంలో మన ఊహకందని సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. కొన్ని నమ్మశక్యంగా ఉంటే మరికొన్ని వీడియో రూపంలో చూస్తే కానీ నమ్మలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తమిళనాడులో సరిగ్గా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. నీలగిరి జిల్లాలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతుండగా ఇంటి బయట సడెన్‌గా ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. పెళ్లివారంతా ఇంట్లోనే ఉండగా, ఎలుగుబంటి ఇంటి బయట అతిథుల కోసం తయారు చేసిన కాఫీని తాగి, కాసేపు కూర్చుని వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆ ఇంటి పెంపుడు కుక్క అరవడంతో అక్కడికి వెళ్లిన ఓ యువకుడు ఎలుగుబంటిని చూసి షాకయ్యాడు. దానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలిగించకుండా జరిగేదంతా తన స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో తీశాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.