ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డు మీదకు వెళ్లామంటే తిరిగి వచ్చేవరకు గ్యారంటీ లేని రోజులివి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వారి నిర్లక్ష్యంలో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలతో ఆనందంగా సాగుతున్న జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. ప్రమాదాల్లో అక్కడికక్కడే కొందరు ప్రాణాలు వదిలేస్తే. మరొకొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవతారు. కొన్నిసార్లు మాత్రం ప్రమాదానికి కారణమైన వాళ్లు అదృష్టంతో బతికిబట్టకడతారు. ఇదిగో ఈ కింద వీడియోలో ఉన్న వ్యక్తి లాగా..
ऐसी गति राखिये, दुर्घटना कभी ना होय,
औरन भी सुरक्षित रहै, आपौ सुरक्षित होय. pic.twitter.com/Gvy6B96EdD— Dipanshu Kabra (@ipskabra) January 5, 2023
భూమి మీద నూకలు మిగిలుంటే..ఎలాంటి ప్రమాదం నుంచైనా తప్పించుకోవచ్చని మరోసారి రుజువు చేశాడు ఈ బైకర్. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రకారం లింక్ రోడ్డు నుంచి ఓ యువకుడు బైక్ తో వేగంగా మెయిన్ రోడ్డుపైకి దూసుకొచ్చేశాడు. అదే సమయంలో ఓ ట్రక్కు అతి వేగంతో వచ్చేసింది. బైక్ను ఢీ కొట్టబోయే సెకెన్ల ముందు ట్రక్కు డ్రైవర్ దానిని పక్కకు మళ్లించాడు. దీంతో ట్రక్కు రోడ్డు బయటకు దూసుకుపోయింది. క్షణాల్లో ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు బైకర్. తర్వాత అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ప్రమాదానికి తానే కారణమైనా ఏమీ పట్టనట్టు జారుకున్నాడు. తనకు ప్రమాదం జరగకుండా కాపాడిన ట్రక్కు డ్రైవర్ గురించి వదిలేసి వదిలేసి బైక్పై రయ్ రయ్ మంటూ పోయాడు. ఈ ప్రమాదంలో ట్రక్కు మాత్రం గట్టిగానే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారి దీపాంశు షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్న విషయం తెలియలేదు.