పిల్లి కరిస్తే లైట్ తీసుకుంటున్నారా ? పిల్లే కదే.. ఏం కాదు అనుకుంటే మీరు ప్రమాదంలో పడినట్టే..ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది జాగ్రత్త. ఇంట్లో ఇష్టంతో పెంచుకుంటున్న కొన్ని పెంపుడు జంతువులతో ప్రాణాలకు ముప్పు వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో అవి కరిస్తే నిర్లక్ష్యం చేయడం కొంపముంచుతుంది. కుక్క కరిస్తే ఆస్పత్రికి పరిగెత్తే..జనం పిల్లి కరిస్తే మాత్రం కొన్ని సార్లు అశ్రద్ధ వహిస్తారు. అయితే పిల్లి కాటుతో కూడా ప్రాణాలు పోవొచ్చని తాజాగా జరిగిన ఓ ఘటన చెప్తుంది. ఇష్టంగా పెంచుకున్న ఓ పిల్లి కరవడంతో నాలుగేళ్ళు తర్వాత ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన డెన్మార్క్‌లో జరిగింది.
33 ఏళ్ల హెన్రిక్ తన ఇంట్లో ఓ పిల్లి పెంచుకున్నాడు. దానికి ఆండ్రీ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకున్నాడు. అనుకోకుండా 2018లో ఆ పిల్లి అతడి వేలిని కరిచింది. అయితే పిల్లి కదా నిర్లక్ష్యం చేశాడు. తర్వతా కొన్ని రోజులుగా అతడి వేనికి నొప్పి ప్రారంభమైంది. దీంతో ఆస్పత్రికి వెళ్లాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో పాటు శరీరంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. వైద్యులు ఎన్ని చికిత్సలు అందించినా ఫలిత లేకుండా పోయింది. చివరికి వైద్యులు అతడి వేనిని తొలగించారు. అయితే అప్పటికే మొదలైన కొత్త సమస్యలతో హెన్రిక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. విషం శరీరం అంతటా వ్యాపించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఉబ్బిన వేలిని కత్తిరించిన తర్వాత చేయి మొత్తం వాచిపోయింది. వైద్యులు అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నెల రోజులు అతడిని ఆస్పత్రిలో ఉంచి 15 ఆపరేషన్లు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది.చివరికి పిల్లి కరిచిన నాలుగేళ్లకు మరణించాడు. పిల్లి కరిచిన చోట నుంచి ఇన్ఫెక్షన్ మొదలై శరీరం అంతా వ్యాపించినట్టు హెన్రిక్ తల్లి తెలిపింది.