A bitter experience for a Hyderabad girl..Passport blocked
mictv telugu

తెలుగు యువతికి చేదు అనుభవం..పాస్‌పోర్టు బ్లాక్

August 4, 2022

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్న దీప్తి అనే యువతికి ఫిలిప్పీన్స్‌ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. భారత్ నుంచి ఫిలిప్పీన్స్‌‌కు వెళ్లిన ఆమెను అక్కడి ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసి తిరిగి మళ్లీ భారత్‌కే పంపేశారు. తనను ఎందుకు ఇలా వెనక్కి పంపించేస్తున్నారు? అని సిబ్బందిని ప్రశ్నించగా..”నీ పేరు బ్లాక్‌లిస్ట్‌లో ఉంది” అని చెప్పారు. దాంతో ఆ యువతి ఒక్కసారిగా ఖంగుతింది. ఏం చేయాలో తెలియక, ఏం అర్థంకాక కన్నీరు కారుస్తూ, భారత్‌కు తిరిగి వచ్చేసింది.

/video-gallery/telugu-video/hyderabad-woman-facing-trouble-in-philippines/videoshow/93339898.cms?utm_source=slikevideo&utm_medium=referral

అనంతరం ఓ వీడియో ద్వారా ఆమె మాట్లాడుతూ, అసలు విషయాన్ని వెల్లడించింది. ”నా పేరు ఎనుగుల నవ్య దీప్తి. నేను ఫిలిప్పీన్స్‌‌లో ఎంబీబీఎస్ మూడోవ సంవత్సరం చదువుతున్నాను. కరోనా సమయంలో కాలేజ్ బంద్ చేయడంతో హైదరాబాద్‌కు వచ్చాను. అయితే, అక్కడ ఓ ఇంట్లో నేను అద్దెకుంటూ చదువుకున్నాను. హైదరాబాద్‌ వచ్చేశాక అద్దె డబ్బులు ఇవ్వాలని ఆ ఇంటి యజమానురాలు నాకు ఫోన్ చేసి అడిగింది. అద్దె డబ్బులు పోను మరో రూ.40 వేలు ఇవ్వకుంటే నాపై కేసు పెడతానని బెదరించింది. దాంతో ఆ డబ్బును కూడా నేను ముట్టజెప్పాను. ఆ ఇంటి యజమానురాలు పాస్‌పోర్టు కార్యాలయంలో పనిచేస్తుంది. ఆ పరపతిని ఉపయోగించి నా పాస్‌పోర్టు బ్లాక్ చేయించింది. అడిగినంత డబ్బులు ఇచ్చినా కూడా నాపై ఎందుకు కక్ష్య కట్టిందో నాకు అసలు అర్థకావటం లేదు., నా పేరును బ్లాక్ లిస్టులో చేర్చడం దారుణం” అని దీప్తి ఆవేదన వ్యక్తం చేసింది.