ప్రస్తుత కాలంలో హార్ట్ ఎటాక్ సమస్య పెరిగిపోతుంది. వయుస్సుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి.పేలవమైన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారాలు కారణంతో 25 నుంచి 30 ఏండ్ల యువత ప్రాణాలుపోతున్నాయి. ప్రతిరోజు వ్యాయామం, డైట్ ఫాలోయింగ్, యోగా వంటివి చేసే సెలబ్రెటీలు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. కూర్చున్న చోటే కుప్పకూలి సెకెన్లతో ప్రాణాలు వదిలేస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులు సైతం గుండెపోటుకు గురవ్వడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరో 12 ఏళ్ల బాలుడు హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు.
కర్ణాటకలోని మడికేరి జిల్లాకు చెందిన కీర్తన్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితులతో సరదాగా ఆడుకొని ఇంటికి వచ్చాడు. కాసేపటికే గుండెలో నలతగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే కుశాలనగర ఆస్పత్రికి తరలించారు.బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. అప్పటి వరకు సరదాగా కళ్ళముందు ఆడుకున్న కుమారుడు చిన్న వయుస్సులో గుండెపోటుతో మరణించడం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు కీర్తన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని..గుండె నొప్పి రావడం ఇదే మొదటిసారని బంధువులు తెలిపారు.