వీడియో : వింత ఆచారం.. మేకను పెళ్లి చేసుకున్న యువకుడు - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : వింత ఆచారం.. మేకను పెళ్లి చేసుకున్న యువకుడు

April 4, 2022

02

జాతకంలో ఉన్న దోషానికి నివారణ కోసం ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని ఉండడంతో మొదటి పెళ్లి మేకతో చేసి, రెండో పెళ్లిని అమ్మాయితో చేపిద్ధామని పెద్దల ఆలోచన. దోష నివారణ కోసం ఇలా చేయొచ్చని హిందూ ధర్మంలో ఉందని వారు చెప్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులోని అన్నవరం రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఉగాది రోజున స్థానికంగా ఉన్న నవగ్రహ ఆలయంలో అర్చకుల సహాయంతో ఆ యువకుడు మేకను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఇలా జాతకాలను బట్టి, జంతువులను వివాహం చేసుకోవడం పట్ల పలువురు అభ్యుదయ వాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.