ఫేస్‌బుక్‌తో ప్రేమ పెళ్లి.. రిసెప్షన్‌లో దిమ్మ తిరిగే షాకిచ్చిన అతిథి - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌తో ప్రేమ పెళ్లి.. రిసెప్షన్‌లో దిమ్మ తిరిగే షాకిచ్చిన అతిథి

May 28, 2022

వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతీ యువకులు ఫేస్ బుక్ ద్వారా పరిచయమై కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడిపోయారు. ఊసులు చెప్పుకున్నాక పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయి, ఇరువురు తమ తమ పేరెంట్స్‌కి చెప్పి ఒప్పించుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి బాగా జరిగింది. ఇక రిసెప్షన్‌ జరుగుతుండగా వధువు గురించి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వరుడి గుండె ముక్కలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అలోక్ కుమార్ అనే యువకుడికి ఒడిషాకు చెందిన మేఘన అనే అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. చాటింగులు చేస్తూ, చేస్తూ 15 రోజులకే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో మే 24న ఇద్దరూ ఓ చోట కలుసుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుండగా, అతిథులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెద్దాయన వధువుని మేఘనాథ్ అని పిలిచాడు. ఇదేంటి ఇలా పిలుస్తున్నాడరని వరుడు ఆశ్చర్యపోతుండగా, అతని పేరు మేఘన కాదు, మేఘనాథ్ అని, అతను తమ దగ్గరి బంధువు అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. నిజమని నిర్ధారించుకున్న వరుడు, అతని కుటుంబ సభ్యులు వధువు వేషంలో ఉన్న మేఘనాథ్‌ని కర్రలతో చితకబాదారు. అతని పొడవాటి జుట్టు కత్తిరించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో వరుడి మనస్సు విచారం, వికారంతో నిజాన్ని జీర్ణించుకోలేక వాంతులు చేసుకున్నాడు. కాగా, ప్రేమించే ముందు కనీసం అమ్మాయా? అబ్బాయా? అని కూడా తెలుసుకోలేదా? అంటూ బంధువులు, గ్రామస్థులు వరుడిని తిట్టిపోస్తున్నారు.