ఈ మధ్య పెళ్లిళ్లు చాలా జరుగుతుండడంతో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిన్న చిన్న కారణాలతో ఆఖరి నిమిషంలో చాలా మంది పెళ్లిళ్లను రద్దు చేసుకుంటున్నారు. వరుడు తాగి వచ్చాడనో, ఆలస్యంగా మండపానికి చేరుకున్నాడనో కొంత మంది వధువులు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు చెప్పబోయే వివాహం కూడా అలాంటి ఓ చిన్న కారణంతో చివరి నిమిషంలో రద్దైంది. వివరాలు.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ జంట పెళ్లికి సిద్ధమయ్యారు. అన్నీ అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. కాసేపట్లో నూతన వధూవరులు పూల దండలు మార్చుకుంటారు అనగా వధువు వేదిక మీదకి చేరుకుంది. ఆ సమయంలో ఆమె ఓ లోపాన్ని గమనించింది.
పెళ్లి ముఖ్య ఘట్టానికి చేరుకున్నాక వేడుకను ఎవరూ కూడా ఫోటోలు, వీడియోలు తీయట్లేదని గుర్తించింది. అంటే వరుడి తరపున వాళ్లు ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లను పెట్టలేదని గ్రహించి బాధ, కోపంతో వేదిక దిగి వెళ్లిపోయింది. దీంతో అవాక్కయిన బంధువులు వధువు వద్దకు వెళ్లి కారణం అడుగగా, అసలు విషయం చెప్పింది. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లిని ఫోటోలు, వీడియోలు కూడా తీయించాలనే ఇంగిత బుద్ధిలేని ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని ఎలా కాపురం చేయమంటారని ప్రశ్నించింది. అలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం తనకు ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో అప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్‌ను వెతికే పనిలో పడ్డారు వరుడి తరపు బంధువులు. మరి వధువు పాయింట్ నిజమే కదా. మనకంటే ఈ విషయం వింతగా ఉంటుంది కానీ, మన కంటే దాదాపు దశాబ్దాల వెనుకబాటు ఉంటుంది అక్కడ. పాతిక, ముప్పై సంవత్సరాల క్రితం మన వద్ద కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. కానీ, ఇప్పుడు ఫోన్లోనే చాలా రకాల కెమెరాలు వచ్చిన కాలంలో వరుడు చేసిన పని నిజంగా తప్పే కదా. మీరేమంటారు కామెంట్ చేయండి.