టైం పాస్ ప్రేమ ప్రాణాలు తీస్తోంది. ప్రేమించిన వారు మోసం చేశారనే కారణంతో యువతీ,యువకులు బలవంతంగా చనిపోతున్నారు. కని పెంచిన తల్లిదండ్రులను మరిచి క్షణికావేశంలో జీవితానికి ఎండ్ కార్డ్ వేసుకుంటున్నారు. తాజాగా విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ లెటర్ రాసి ట్రైన్ కింది పడి చనిపోయాడు. ఎంత బతిమాలినా తనలో మార్పు రాకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువతి టైమ్ పాస్ ప్రేమతో తాను పిచ్చోడిని అయ్యానని, జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నానని లేఖలో రాశాడు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు అడగరని అబ్దుల్ సలామ్ తన సూసైడ్ లేఖలో ప్రశ్నించాడు.
లెక్చరర్‌తో న్యూడ్ కాల్
బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ లేఖ వివరాలు ప్రకారం ” నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది. ఆమెలో వచ్చిన మార్పులు కారణంగా ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పి వేరే వారితో సన్నిహితంగా ఉంటుంది. పెళ్లయిన లెక్చరర్‌తో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నట్లు తెలుసుకున్నాను. పద్ధతి మార్చుకోవాలని సూచించినా ఆమెలో మార్పు రాలేదు. అంతే కాకుండా మరో యువకుడితో రాత్రివేళల్లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆమె మారుతుందని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లాభం లేకుండా పోయింది. యువతి టైమ్ పాస్ ప్రేమతో తాను పిచ్చోడిని అయ్యా. జీవితం మీద విరక్తితో తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఈ నిర్ణయం తీసుకున్నాను” అని లేఖలో యువకుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరని సలామ్ లేఖలో రాశాడు. సదరు యువతి చేతిలో తనలాగే మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో కోరాడు.