A buffalo that gave birth to an 8-legged calf in madhya pradesh
mictv telugu

ఇదో వింత.. 8 కాళ్ల లేగదూడకు జన్మనిచ్చిన గేదె

November 8, 2022

A buffalo that gave birth to an 8-legged calf in madhya pradesh

ఇప్పటివరకు వింతగా జన్మించిన గొర్రె, మేక పిల్లల గురించి విని ఉంటాం. కానీ మొదటిసారిగా ఓ గేదె ఎనిమిది కాళ్ల లేగదూడకు జన్మనిచ్చింది. ముందు వెనుక రెండు కాళ్లతో పాటు మధ్యలో మరో నాలుగు కాళ్లుండడం చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు.

అంతేకాక, దూడను చూసేందుకు భారీగా ఎగబడుతున్నారు. మధ్యప్రదేశ్‌‌లోని గుణ జిల్లా మధుసూదన్ గఢ్‌‌లో ఈ అద్భుత ఘటన చోటుచేసుకుంది. శివనారాయణ్ కుష్వాహా అనే రైతుకు చాలా పశువులు ఉన్నాయి. వాటిలో ఓ గేదె సోమవారం రాత్రి ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అయితే ఎనిమిది కాళ్లుండడంతో అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పైగా దూడ ఆరోగ్యంగానే ఉండడంతో యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎనిమిది కాళ్లుండడం వల్ల సరిగ్గా నిలబడలేకపోతోందని, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్తున్నారు. సాధారణంగా ఇలా పుట్టిన జీవులు తొందరగా చనిపోతాయి. కానీ, ఈ దూడ విషయంలో అలా జరక్కపోవడంతో సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున శివనారాయణ్ ఇంటికి చేరుకుంటున్నారు.