వీడియో : వామ్మో ఒంటెకు ఇన్ని కోట్లా! వైరలవుతున్న వేలంపాట - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : వామ్మో ఒంటెకు ఇన్ని కోట్లా! వైరలవుతున్న వేలంపాట

May 9, 2022

మనం గొర్రెలు, మేకలు పెంచుకున్నట్టు అరబ్ దేశాల్లో ఒంటెలను పెంచుకుంటారు. మన వారపు సంతల్లో పశువులను కొనుగోలు చేసినట్టు అక్కడ ఒంటెలను కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో అరుదైన జాతికి చెందిన ఓ ఒంటె భారీ ధరకు అమ్ముడుపోయింది. గల్ఫ్ న్యూస్ ప్రకారం వేలంపాట మొదట పదికోట్ల రూపాయల నుంచి మొదలవగా, చివరికి ఓ వ్యక్తి ఒంటెను 14.23 కోట్ల రూపాయలకు (ఏడు మిలియన్ల సౌదీ రియాల్స్) కొనుగోలు చేశాడు. ఈ జాతికి చెందిన ఒంటెలు అరుదుగా కనిపిస్తాయంట. అందుకని షేక్‌లు ఒంటెను కొనేందుకు పోటీపడ్డారని అక్కడి మీడియా తెలిపింది. ఏదేమైనా ఒంటెకు అంత ధర అంటే షాకే కదా.