వీడియో : HYD రోడ్డుపై వెళ్తున్న యువతిపై కారుతో హత్యాయత్నం - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : HYD రోడ్డుపై వెళ్తున్న యువతిపై కారుతో హత్యాయత్నం

July 7, 2022

హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని హకీం హిల్స్ కాలనీలో ఓ యువతిపై హత్యాయత్నం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కారుతో గుద్దిన దుండగులు వెంటనే పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. యాక్సిడెంట్‌గా కనిపిస్తున్న ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ బట్టి వివరాలిలా ఉన్నాయి. రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కారు ముందుకు తీసుకొని వెళ్లి తర్వాత రివర్స్ చేసి మరీ ఎదురుగా వస్తున్న యువతిని దుండగులు ఢీకొట్టారు. తర్వాత అదే కారులో పారిపోయారు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కారును రివర్స్ చేసి మరీ గుద్దాడంటే ఖచ్చితంగా హత్య కోణం ఉండే ఉంటుందని పలువురు అనుమానపడుతున్నారు. కానీ, యువతి కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదంగా పోలీస్ కేసు పెట్టడం గమనార్హం. దీంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.