A case will be filed against Ramasethu movie: Subramanya Swamy
mictv telugu

రామసేతు వివాదం.. కేసు వేస్తానని ఎవరైనా ఆ హీరోకు చెప్పండి

July 29, 2022

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన చిత్రం రామసేతు. శ్రీరాముడు నిర్మించిన రామసేతు నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఇందులో పేర్కొన్న అంశాల పట్ల అభ్యంతరాలున్నాయని ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. అంతేకాక, సినిమాను అలాగే విడుదల చేస్తే పరిహారం కోసం కోర్టులో దావా వేస్తానని, అప్పుడు నష్టపోక తప్పదని వెల్లడించారు. ఈ మేరకు ఎవరైనా అక్షయ్ కమార్‌, కర్మ మీడియాలకు తెలియజేయండని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో అక్షయ్ కుమార్ కాగడా పట్టుకొని ఉండగా, చేతిలో టార్చిలైటుతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించింది. తెలుగు నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.