మనిషిని పొడిచి చంపిన పక్షి - MicTv.in - Telugu News
mictv telugu

మనిషిని పొడిచి చంపిన పక్షి

April 15, 2019

పాముకి పాలు పోసి పెంచినా అది కక్కేది విషమే. కొన్ని సార్లు యజమానుల పైనే పగ పెంచుకొని కాటు వేస్తుంటాయి. అలాగే కుక్కలకు చిర్రెత్తినా కూడా యజమానుల పని అయిపోయినట్టే. ఇప్పుడు ఈ జాబితాలోకి వచ్చి చేరింది ఎగరలేని భారీ పక్షి ‘కాస్సొవారీ’. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో కనిపించే ఈ పక్షి అలాచువా కౌంటీ ప్రాంతంలో పొలంలో జారిపడిన తన 75 ఏళ్ళ యజమాని మార్విన్ హాజోస్‌ని పొడిచి చంపేసింది. ఈ పక్షి కాళ్లు పెద్దసైజు పంజాలా ఉంటాయి. వాటితోనే మార్విన్ హాజోస్‌‌ని గుచ్చి గుచ్చి పొడిచి ప్రాణం తీసింది.

A cassowary, a rare emu-like bird, attacks and kills Florida man, officials say

ఒకరోజు ఉదయం పది గంటలకు ఫైర్ రెస్క్యూ విభాగానికి కాల్ వచ్చింది. వాళ్లు వచ్చి పొలంలో చూసేసరికి… మార్విన్ హాజోస్ ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే అతడు మరణించాడు. మార్విన్ హాజోస్‌ని పక్షే చంపేసిందని తెలిసినా, ఫార్మాల్టీ ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ మొదలుపెట్టారు. పక్షి ఎందుకు చంపిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ పక్షిని ప్రత్యేక ప్రదేశంలో బంధీ చేశారు. ఈ జాతి పక్షులు చూడటానికి ఈము పక్షుల్లా ఉంటాయి. దాదాపు 6 అడుగుల ఎత్తు, 60 కేజీల బరువు పెరుగుతాయి. ఇవి అరుదైన పక్షి జాతికి చెందినవి. కాస్సొవారీ కాళ్ల పంజా దాదాపు 10 సెంటీమీటర్లు ఉంటుంది. కత్తుల్లాంటి గోళ్లుంటాయి. ఒక్క కిక్కుతో శత్రువు రక్తం కళ్లజూడగలదు. గంటకు 50 కిలోమీటర్లు పరిగెత్తే ఈ పక్షులు దట్టమైన అడవుల్లో ఉంటాయి.