A center where prices of 11 types of essential commodities have been reduced
mictv telugu

సామాన్యులకు గుడ్ న్యూస్.. 11 వస్తువుల ధరలు తగ్గించిన కేంద్రం.. ధరల పట్టిక ఇదిగో

October 4, 2022

A center where prices of 11 types of essential commodities have been reduced

సామాన్యులకు గుడ్ న్యూస్.. 11 వస్తువుల ధరలు తగ్గించిన కేంద్రం.. ధరల పట్టిక ఇదిగో
పండుగల వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని సామాన్యులు, మధ్య తరగతి వారికి శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాల నిత్యావసరాల ధరలను తగ్గించింది. ఈ మేరకు ధరల పట్టికను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 2 వరకు తగ్గిన ఆయా వస్తువుల ధరలను ఇందులో పేర్కొన్నారు. లీటర్ పామాయిల్ ధర రూ. 132 నుంచి 11 శాతం తగ్గి రూ. 118కి చేరింది. వనస్పతి నెయ్యి కిలో రూ. 152 నుంచి 6 శాతం తగ్గి రూ. 143కి దిగి వచ్చింది. అత్యధికంగా వినియోగించే సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ. 176 నుంచి రూ. 165కి, సోయాబీన్ ఆయిల్ రూ. 156 నుంచి రూ. 148కి తగ్గింది. పల్లీ నూనె లీటరుకు నాలుగు రూపాయలు తగ్గి రూ. 185కి చేరింది. అలాగే ఉల్లిపాయలు, ఆలుగడ్డలు కిలోకి రెండు రూపాయల మేర దిగి వచ్చాయి. పప్పు దినుసులు కిలో రూ. 74 నుంచి రూ. 71కి, మసూర్ దాల్ రూ. 97 నుంచి రూ. 71కి, మినప్పప్పు రెండు రూపాయలు తగ్గి 106 వద్ద ఆగింది. అంతర్జాతీయంగా ధరల పతనంతో దేశీయ మార్కెట్లో ఆహారం, చమురు ధరలు తగ్గాయని, దిగుమతి సుంకాలు కూడా తగ్గించడంతో వంట నూనెల ధరలు గణనీయంగా పడిపోయాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది.