US Shooting : ఫ్లోరిడాలో దారుణం..చిన్నారిని కాల్చిన చంపిన ఓ ఛానెల్ రిపోర్టర్..!! - Telugu News - Mic tv
mictv telugu

US Shooting : ఫ్లోరిడాలో దారుణం..చిన్నారిని కాల్చిన చంపిన ఓ ఛానెల్ రిపోర్టర్..!!

February 23, 2023

ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా..అమెరికాలో కాల్పులు ఆగడం లేదు. నిత్యం ఏదొక చోట కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఫ్లోరిడా సెంట్రల్ టెలివిజన్ రిపోర్టర్, చిన్నారిని కాల్చి చంపాడు. ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ జాన్ మినా బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఈ ఘటన జరిగింది. 19 ఏళ్ల కీత్ మెల్విన్ మోసెస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

 

ఓర్లాండో-ఏరియా పరిసరాల్లో జరిగిన రెండు కాల్పులకు కీత్ మెల్విన్ మోసెస్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. రెండవ షూటింగ్ సమయంలో స్పెక్ట్రమ్ న్యూస్ 13 రిపోర్టర్, 9 ఏళ్ల బాలికతో పాటు టీవీ సిబ్బంది బాలిక తల్లి గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.