A chicken sleeping in water
mictv telugu

వీడియో: అరే భలే విచిత్రంగా ఉందే!..కోడి నీళ్లలో

July 15, 2022

ఈ మధ్య కోళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి వల్ల ఎలాంటి సమస్య రాకపోయినా అవి ఎందుకలా చేస్తున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ మధ్య ఆనంద్ మహీంద్రా ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఓ పుంజు ఏకధాటిగా 18 సెకండ్ల పాటు అరచి కిందపడిపోయింది. ఇప్పుడు మరో వింత, విచిత్ర ఘటన జరిగింది. ఓ కోడి నీటిలో వెల్లకిలా పడుకొని ఉంది. దాన్ని చూస్తే చనిపోయిందేమో అని అనుకుంటారు. కానీ ఓ వ్యక్తి దాన్ని కదపగా, నిద్రపోతున్న కోడి ఒక్కసారిగా లేచి కూర్చుంది. అసలు కోడి నీటిలో నిద్రపోవడమేంటి? ఎలా సాధ్యం? వంటి ప్రశ్నలు ఈ వీడియో చూసిన నెటిజన్ల నుంచి వస్తున్నాయి. అలాగే ఓ కోడి సైనికులు కవాతు చేసినట్టు చేసింది. ఈ చేష్టలు సరదా కోసం చేస్తున్నాయా? లేదా ఇంకేమైనా కారణముందా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. మీకూ నచ్చితే కామెంట్ చేయండి.