A Chinese bride who cheated on her husband the day before the wedding
mictv telugu

పెళ్లికి ముందురోజు నవ వధువు సీక్రెట్ రొమాన్స్.. చైనాలో రేగిన రచ్చ

November 25, 2022

A Chinese bride who cheated on her husband the day before the wedding

ఈ కాలంలో పెళ్లికి ముందు ప్రేమ, శారీరక సంబంధం మామూలైపోయింది. సాంప్రదాయానికి విలువిచ్చే మన దేశంలోనే రోజూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూంటాయి. దీంతో మన దగ్గర కూడా ఈ విషయానికి అంత ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. అయితే ప్రేమించిన జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పెళ్లి సాధ్యం కాకపోతే ఎవరి పెళ్లి వారు చేసుకొని హాయిగా బ్రతకాలి. కానీ చైనాలో ఓ ప్రియుడు చేసిన పని దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. పెళ్లయిన మరుసటి రోజు కట్టుకున్న భర్త విడాకుల కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.

చివరికి నవ వధువు అవమానం భరించలేక తన నగరాన్ని వీడి వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది. అసలేమైందంటే.. మరుసటి రోజు పెళ్లి కావాల్సిన నవ వధువు అంతకు ముందు రోజు రాత్రి తన ప్రియుడితో శారీరకంగా కలిసింది. అయితే ప్రేమికుడు చేసిన అత్యుత్సాహపు పనితో వీరి సీక్రెట్ రొమాన్స్ బట్టబయలైంది. తమ మధ్య జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్లను ప్రియుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వధువు పెళ్లికి ముందు రోజు చేసిన పని వెలుగులోకి వచ్చింది. తన భార్య చేసిన నిర్వాకం భర్తకు తెలిసిపోయింది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వధువుపై విమర్శలు వచ్చాయి.

దీన్ని అవమానంగా భావించిన వరుడు పెళ్లయి 24 గంటలు గడవక ముందే విడాకుల కోసం అప్లై చేశాడు. ఇలాంటి అమ్మాయితో జీవితాంతం ఒకే ఇంట్లో కలిసి ఉండలేనని ఫిర్యాదు చేశాడు. అంతేకాక, తానిచ్చిన బహుమతులను వెనక్కి తీసుకున్నాడు. అప్పటినుంచి వధువును అందరూ చిన్నచూపు చూడడం మొదలెట్టడంతో ప్రజలు తనపై ఆగ్రహంతో ఉన్నారని గ్రహించిన సదరు వధువు నగరం విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక సోషల్ మీడియాలో ప్రియుడు షేర్ చేసిన పోస్టులకు ఓ నెటిజన్.. ఒకవేళ అమ్మాయి గర్భం దాల్చితే దానికి తండ్రి ఎవరని ప్రశ్నించగా, దానికి దేవుడే సమాధానం చెప్పాలని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.

ఎందుకు ఈ పని చేశావంటే అమ్మాయిల్లో తనకుండే క్రేజ్ ఏంటో చూపించుకోవాలనే చాట్ ను పోస్ట్ చేసినట్టు తాపీగా చెప్పాడు. అంటే గొప్పలకు పోయి తన ప్రేయసి జీవితాన్ని నాశనం చేశాడని కొందరంటుంటే ఇలాంటి అమ్మాయిలను చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తోందని కొందరు అబ్బాయిలు కామెంట్లు చేస్తున్నారు. కాగా, చైనాలో అమ్మాయిల కొరత వల్ల అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థతి ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న అమ్మాయిలు ఇలా అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటున్నారని అక్కడి సామజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.