దీని ధర 778 కోట్లు.. ఏముందంటే, అంతే! - MicTv.in - Telugu News
mictv telugu

దీని ధర 778 కోట్లు.. ఏముందంటే, అంతే!

May 15, 2019

ఇష్టమైన వస్తువును కొనడానికి కొందరు ఎంత ధరైనా లెక్కచేయకుండా కొనేస్తారు. ఓ వ్యక్తి తనకు నచ్చిన పెయింటింగ్‌ను 110.7 మిలియన్‌ డాలర్ల(దాదాపు 778 కోట్ల రూపాయలు)కు కొన్నాడు. అతను ఎవరన్నది గోప్యంగా వుంచారు పెయింటింగ్ వేలం వేసిన నిర్వాహకులు. ఆ పెయింటింగ్ వేసింది ప్రఖ్యాత ఫ్రెంచ్‌ చిత్రకారుడు క్లాడ్‌ మోనెట్‌. మంగళవారం హేస్టాక్‌ కలెక‌్షన్‌లో భాగంగా ఓ సంస్థ ఈ ఏడాది పెయింటింగ్ వేలం నిర్వహించింది. మ్యూల్స్‌గా నామకరణం చేసిన ఈ పెయింటింగ్ ఇంత ధరకు అమ్ముడుపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేలం వేసిన కేవలం 8 నిమిషాల్లోనే మ్యూల్స్‌ అమ్ముడుపోయింది. ఈ పెయింటింగ్‌తో మరో రెండు పెయింటింగ్‌లు మాత్రమే అమ్ముడుపోయాయి.

అత్యధిక ధర పలికిన ఇమ్‌ప్రెసినిస్ట్‌ పెయింటింగ్‌గా చరిత్ర సృష్టించింది. కోతకొచ్చిన గోధుమ పంటను 25 రకాల పెయిటింగ్‌లలో మోనెట్‌ కుంచె అద్భుతంగా చిత్రీకరించింది. మోనెట్‌ కుంచె నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలను హేస్టాక్‌ కలెక‌్షన్‌ అని పిలుస్తారు. కాగా, ఫ్రాన్స్‌లో రూపుదిద్దుకున్న ఫ్రెంచ్‌ ఇమ్‌ప్రెనిజమ్‌(సంప్రదాయేతర పద్ధతిలో, విభిన్న కోణాలలో పెయింటింగ్ వేస్తారు)కు క్లాడ్‌ మోనెట్‌ను ఆద్యుడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పెటియింగ్‌లకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. తన పెయింటింగ్స్‌తో అనేకమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన 1926లో మరణించారు. అప్పుడాయన వయసు 86 ఏళ్లు.

ఇదిలావుండగా పెయింటింగ్‌కు ఇంతభారీమొత్తంలో కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో పేరు చెబితే బాగుండేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కోరుతున్నారు. అయినా ఒక పెయింటింగ్‌కు ఇంత ధరా.. అని కొందరు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.