అలాంటి వారికి మద్యం, రేషన్ సరుకులు కట్ చేసిన కలెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

అలాంటి వారికి మద్యం, రేషన్ సరుకులు కట్ చేసిన కలెక్టర్

April 15, 2022

5

ప్రభుత్వాలు ఎంత చెప్పినా హెల్మెట్ ధరించకుండా, కారులో సీటు బెల్టు పెట్టుకోనివారు చాలా మంది ఉంటారు. ఎంత జరిమానాలు విధించినా కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం కీక నిర్ణయం తీసుకుంది. అలాంటి వారికి సహాయ నిరాకరణ ప్రకటించింది. అక్కడి కలెక్టర్ ప్రభు శంకర్ మాట్లాడుతూ.. ‘హెల్మెట్, సీటుబెల్టు ధరించని వారికి రేషన్ సరుకులు, కిరాణా సరుకులు, మద్యం లాంటివి అమ్మడం కొనడం నిషేధిస్తున్నాం. పెట్రోల్, డీజిల్ కూడా పోయకుండా బంకుల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలాంటి మినహాయింపులు లేవు. రోడ్డు ప్రమాదాల్లో మా జిల్లా 36 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. కేవలం 2 శాతం మందే హెల్మెట్ పెట్టుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా’మని వెల్లడించారు.