పొగ తాగితే చాలు.. నెలకు రూ. 2.1 లక్షల జీతం  - MicTv.in - Telugu News
mictv telugu

పొగ తాగితే చాలు.. నెలకు రూ. 2.1 లక్షల జీతం 

November 24, 2019

పొగతాగితే ఆరోగ్యానికి హానికరం. అది జీవితాన్నిచిన్నాభిన్నం చేస్తుంది. ఈ మాటలు మామూలుగా మనం వింటూ ఉంటాం. కానీ పొగతాగితే డబ్బులు కూ సంపాధింవచ్చనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. కేవలం స్మోగింగ్ చేస్తూ ప్రతి నెల 3వేల డాలర్లు సంపాధించే అవకాశాన్ని ఓ సంస్థ కల్పిచింది.

ఈ ఉద్యోగానికి కేవలం స్మోకింగ్ అలవాటు మాత్రమే కాదు. దాన్ని ఆశ్వాధించి దాని ద్వారా వచ్చే అనుభూతి ఎలా ఉంటుందో రివ్యూ కూడా రాయాలి. అవసరమైతే ఓ వీడియో కూడా చేసి వాటి ద్వారా వచ్చే అనుభూతిని చెప్పాలి. AmericanMarijuana.org అనే సంస్థ చేసిన  ఈ ప్రకటన చేసింది. ఈ సంస్థ వివిధ ఉత్పత్తుల నుంచి పరీక్షలు జరిపి వాటి ద్వారా వచ్చే రివ్యూలను అప్‌లోడ్ చేస్తారు. కేవలం సిగరేట్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు గంజాయి లాంటి వాటికి కూడా రివ్యూలు రాయాల్సి ఉంటుంది.

Smoke.

కానీ ఈ ఉద్యోగం చేయాలంటే ఓ నిబంధన కూడా పెట్టింది. దీనికి దరఖాస్తు చేసుకునే వారు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. గంజాయి వల్ల వ్యక్తి నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని రివ్యూ రాయగలిగే వ్యక్తులు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని సంస్థ తెలిపింది. పరీక్షించే ఉత్పత్తులను నెలకొకసారి ఇంటి వద్దకే పంపిస్తారు. వాటిని రుచి చూసి రివ్యూ రాయాలి. కాగా ఇప్పటికే అమెరికా, యూకేల్లో గంజాయి ఉత్పత్తులపై నిషేదం ఉన్నప్పటికీ పరిమిత మోతాదులో ఉపయోగించవచ్చు. అందకే వాటిని పరీక్షించేందుకు ఈ మార్గం ఎంచుకున్నారు. మరి దీనికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటారో లేదో చూడాలి.