ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్టిచ్చిన భారత కంపెనీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్టిచ్చిన భారత కంపెనీ

March 29, 2022

 

bfgb

మనదేశంలోని ఓ కంపెనీ ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన బహుమతినిచ్చింది. దాన్ని చూసిన ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. కొఠారి పెట్రో కెమికల్స్ అనే కంపెనీ మనాలీలోని తన ప్లాంట్ ఉద్యోగులకు హెర్క్యులస్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. అనంతరం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఉద్యోగులకు మెసేజ్ పెట్టింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ పని చేసినట్టు తెలిపింది. దాదాపు 142 మంది ఉద్యోగులున్న ఈకంపెనీలో ఇప్పటివరకు 100 మందికి సైకిళ్లను పంపిణీ చేసింది. ఉన్నతాధికారి, కిందిస్థాయి ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరికీ ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధి మురుగేశ్వరన్ తెలిపారు. ఇందులో బలవంతం ఏమీ లేదనీ, మార్పు అనేది ప్రతీ ఒక్కరిలో స్వతాహాగా రావాలని ఆయన వివరించారు. అందుకోసం ఇప్పటివరకు ఉద్యోగుల కోసం పంపుతూ వస్తున్న వ్యాన్‌ను ఇకపై కూడా పంపుతామని ఆయన స్పష్టం చేశారు. దేనిమీద రావాలో అది ఉద్యోగుల ఛాయిస్‌కే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. అయితే కంపెనీకి పర్యావరణం పట్ల బాధ్యత ఎక్కువే. గతంలో సైకిళ్లతో ర్యాలీని నిర్వహించింది. ఇదిలా ఉండగా, ఎంతమంది ఉద్యోగులు సైకిళ్ల మీద ఆఫీసుకు వస్తారో ఇప్పటికైతే స్పష్టత లేదు.