A crane that was going to lift a truck fell into the water
mictv telugu

ట్రక్‌ను ఎత్తబోయి నీటిలో పడిపోయిన క్రేన్.. వీడియో వైరల్

August 5, 2022

ప్రమాదవశాత్తు బ్రిడ్జీ పై నుంచి నీటిలో పడిపోయిన ట్రక్‌ను ఎత్తడానికి వచ్చిన క్రేన్.. అదే నీటిలో పడిపోయిన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. తాల్చేర్ పట్టణంలో జరిగిన ఈ ఘటనను వీడియో తీయగా చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవున్నారు. ఓ బ్రిడ్జీ మీద నుంచి ట్రక్ నీటిలో పడిపోగా, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని రెండు క్రేన్లను తీసుకొచ్చారు. నీటిలో పడిపోయిన ట్రక్‌ను కేబుళ్లతో రెండు క్రేన్లకు కట్టి పైకి లేపబోయారు. ఇంతలో ఓ క్రేనుకి కట్టిన కేబుల్ తెగిపోవడంతో ట్రక్ బరువు మొత్తం ఒకే క్రేన్‌పై పడింది. దాంతో ఆ బరువును తట్టుకోలేక క్రేన్ ఒక్కసారిగా పైకి లేచి నీటిలో పడిపోయింది. అయితే వీడియో ప్రకారం క్రేన్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. క్రేన్ నీటిలో పడిపోయిన తర్వాత అతను నీటిలోంచి ఈదుకుంటూ ఒడ్డు చేరుకున్నాడు. దాంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.