ఇంట్లో పెద్దకూతురిగా పుట్టినందుకు పెద్ద నిర్ణయమే తీసుకుంది ఓ యువతి. తల్లిదండ్రులు పడుతున్న బాధను చూడలేక తనను ఓ మగాడిలా మార్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 20 ఏళ్ల యువతి స్థానిక మెడికల్ హాస్పిటల్లో లింగ మార్పిడి చికిత్స చేయించుకుని పూర్తి స్థాయిలో అబ్బాయిగా మారిపోయింది. నాలుగు నెలల పాటు హార్మోన్ ఇంజక్షన్లు చేయించుకుంది. దీంతో ఆమెకు గడ్డాలు, మీసాలు పెరిగాయి. ఇక, తాజాగా లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది.
ఐదుసార్లూ కుమార్తెలే కావడంతో..
ఆ యువతి తల్లిదండ్రులూ మగ సంతానం కోసం ప్రయత్నించగా.. వారికి ఐదుసార్లూ కుమార్తెలే పుట్టారు. దీంతో ఆమె తండ్రి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. తన తల్లిదండ్రులు విడిపోకూడదనే కారణంతో కుటుంబంలో పెద్ద కూతురైన ఆ యువతి మగాడిగా మారాలని నిర్ణయించుకుంది. ఐదు నెలల పాటు చికిత్స చేయించుకుని పూర్తి అబ్బాయిగా మారిపోయింది. పూర్తి స్థాయిలో అబ్బాయిగా మారిపోయినప్పటికీ, ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు.