A Delhi-based restaurant announced a cash prize on the occasion of PM Modi's birthday
mictv telugu

’56 అంగుళాల మోదీజీ’ని తింటే రూ. 8.5 లక్షలు

September 16, 2022

దేశ ప్రధాని నరేంద్రమోదీ సెప్టెంబర్ 17న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ఆయన అభిమానులంతా రకరకాల ఆఫర్లు పెడుతున్నారు. తమిళనాడు బీజేపీ శాఖ ఓ ఆస్పత్రిలో ఆ రోజు పుట్టే పిల్లలకు రెండు గ్రాముల బంగారు ఉంగరం ఉచితంగా అందించనుంది. అలాగే సీఎం స్టాలిన్ నియోజకవర్గంలో 700 కిలోలకు పైగా చేపలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇవంతా ఒకెత్తు అయితే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ కస్టమర్లకు ఇచ్చిన భారీ ఆఫర్ మరొక ఎత్తు. కన్నాట్ ప్రాంతంలో ఉండే రెస్టారెంట్ ఆర్డర్ 2.0 ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఓ పోటీని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకంగా రూపొందించిన తాలీని 40 నిమిషాల్లో తినగలిగిన వారికి రూ. 8.50 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ తాలీకి ‘56 అంగుళాల మోదీజీ’ అని పేరు పెట్టింది. ఈ పోటీలో దంపతులు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపింది. విజేతలకు నగదు బహుమతి ఇస్తామని వివరించింది. అంతేకాక, సెప్టెంబర్ 17 నుంచి 26వ తేదీల మధ్య తమ రెస్టారెంటులో తాలీ భుజించిన వారిలో లక్కీ విన్నర్‌ను ఎంపిక చేసి వారికి కేదార్ నాథ్ పర్యటనకు అవకాశం కల్పిస్తామని రెస్టారెంట్ యజమాని సుమిత్ర కల్రా పేర్కొన్నారు.