లిప్‌లాక్ చేసి, నాలుక కొరికేసింది.. ఓ ప్రేయసి కసి - MicTv.in - Telugu News
mictv telugu

లిప్‌లాక్ చేసి, నాలుక కొరికేసింది.. ఓ ప్రేయసి కసి

February 3, 2020

Boyfriend

ముద్దు.. అందులో గాఢమైన ముద్దు..  ప్రేమికులకు మరపురాని మధురమైన అనుభూతిని ఇస్తుంది. కానీ ఓ ప్రియుడికి అది జన్మలో మరచిపోలేని రక్త అనుభవాన్ని మిగిల్చింది. ప్రియురాలి పెదాలపై గాఢ చుంబనం చేస్తుండగా ఆమె లటుక్కున అతని నాలుకను కొరికేసింది. అతగాడు  కుయ్యో మొర్రో అని మొత్తుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై ఆస్పత్రిలో చేరాడు. అమెరికాలోని డెట్రాయిట్‌లో దారుణం చోటుచేసుకుంది.

యూలెట్ వెడ్జ్‌వార్త్(52) అనే మహిళ ప్రియుడి నాలుకను కొరికింది. ముద్దు పెట్టేటప్పడు నాలుకను వాడొద్దంటూ తాను చెప్పానని.. అయినా అతను తాను చెప్పినట్టు వినకుండా అతడి నాలుకను తీశాడని చెప్పింది. అలా నాలుకను తీసినప్పుడు తనకు అసహ్యం కలిగి అతని నాలుకను కొరికినట్టు యూలెట్ తెలిపింది. ఈ ఘటనలో బాధితుడి నాలుక తెగిపోయింది. ఘటనా స్థలంలో చాలా రక్తం ఉన్నట్టు, చిన్న నాలుక ముక్క కూడా దొరికినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ నెల 19న ఈ కేసు ప్రీ ట్రైల్‌కు వెళ్లనుంది. నేరం రుజువైతే యూలెట్‌కు ఏడాది జైలుశిక్ష విధించనున్నట్టు తెలుస్తోంది.