A devotee got a coconut at the auction for Rs.66 thousand
mictv telugu

వేలంలో రూ. 66 వేలు పలికిన కొబ్బరికాయ.. ప్రత్యేకత ఏంటంటే..

November 3, 2022

ఏంటి? కొబ్బరికాయ అంత రేటు పలికిందేంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజంగా జరిగింది. సాధారణంగా కొబ్బరికాయ రూ. 20 లేక రూ. 30 ఉంటుంది. కానీ రూ. 66 వేలు పలికిందంటే ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంది. పైగా వేలం వేసి మరీ దక్కించుకున్నారు. తమిళనాడులోని తేని జిల్లా బోడి ప్రాంతంలో సుబ్రహ్మణ్యస్వామికి చెందిన ఓ ప్రసిద్ధ ఆలయం ఉంది. ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండగా, ఇప్పుడు ఆలయంలో స్కందషష్టి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి వళ్లి, దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పూజల్లో వాడిన వస్తువులను వేలం వేయగా, ఓ భక్తుడు కొబ్బరికాయను రికార్డు స్థాయిలో రూ. 66 వేలకు దక్కించుకున్నాడు. గతేడాది రూ. 27 వేలు పలికింది. ఇంత రేటు పెట్టి కొనడానికి కారణం కేవలం నమ్మకం. అవును. ఈ కొబ్బరికాయను ఇంట్లో ఉంచి పూజలు చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. దీంతో ధర ఎంతైనా పర్వాలేదని 66 వేలకు సదరు భక్తుడు కొన్నాడట.