A divider that sets the traffic..here is the video
mictv telugu

ట్రాఫిక్‌ని సెట్‌ చేసే డివైడర్..వీడియో ఇదిగో

September 1, 2022

చైనా దేశపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా, ఒకవేళ ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతే, ట్రాఫిక్‌ను బట్టి సెట్‌ చేసుకునే డివైడర్‌ను తయారు చేశామని తెలిపింది. అంతేకాదు, ఈ డివైడర్…రోడ్డు మధ్యలో ఉండే వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్‌ చేసి, ట్రాఫిక్‌ని తగ్గిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చైనా అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

”రోడ్డుపై ఓవైపు వాహనాలు వెళ్తున్నాయి. మరోవైపు ఓ రెండు వాహనాలు డివైడర్‌ను సెట్ చేస్తున్నాయి. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్‌ చేసేందుకు ఈ డివైడర్ వర్క్ చేస్తుంది. రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్‌ చేసుకుంటూ, ట్రాఫిక్‌ని తగ్గిస్తుంది. చైనా వాసులు ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు. అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్‌ లైన్‌ని సెట్‌ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది” అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్‌ తెలిపింది.

ఆ వీడియోలో..’ఆ డివైడర్‌ లైన్‌ని ట్రాఫిక్‌ కోసం జిప్‌ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది.వీటిని రివర్సబుల్‌ ట్రాఫిక్‌ లైన్‌లు అంటారు. ఇవి ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తాయి’. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాదని అమెరికా 1960లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆవిష్కరణను ప్రవేశపెట్టినట్లు సమాచారం.