అగ్రవర్ణ డాక్టర్ కావాలంటూ దళిత డాక్టర్‌పై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

అగ్రవర్ణ డాక్టర్ కావాలంటూ దళిత డాక్టర్‌పై దాడి

October 20, 2018

దేశంలో కులోన్మాదం రెచ్చిపోతోంది. కులం పేరుతో సాగుతున్న దారుణాలకు లెక్కలేకుండా పోతోంది. గ్రామబహిష్కరణ, గాడిదలపై ఊరేగింపులు, దాడులు, హత్యలు.. చిట్టాకు అంతుండదు. తాజాగా ఇందులో కులవైద్యం కూడా చేరిపోయింది. వైద్యో నారాయణో హరి అంటే అనొచ్చుగాని మాకు మాత్రం మా కులపు డాక్టర్లే వైద్యం చేయాలని కులోన్మాదులు రెచ్చిపోయారు. ఒక దళిత వైద్యుడిపై దాడి చేసి గాయపరిచారు.  A doctor belonging to Scheduled Tribe community has alleged that he was beaten up by relatives of two patients in Madhya Pradesh’s Jabalpur. The police said that the relatives wanted the patients to be treated by an "upper caste" person.మధ్యప్రదేశ్‌లో జబల్పూర్‌లో ఈ దారుణం జరిగింది. గత  శుక్రవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలను సుభాష్ చంద్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు. గీతేశ్ రాత్రే  అనే వైద్యుడు నర్సులతో కలసి ప్రాథమిక చికిత్స చేస్తుండగా, సదరు క్షతగాత్ర మహిళల బంధువులు అడ్డుచెప్పారు. ముందు గీతేశ్ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎస్టీనని గీతేశ్ నిర్భయంగా చెప్పాడు. దీంతో వారు.. ‘నువ్వు మావారికి వైద్యం చేయొద్దు.. నీది తక్కువ కులం.. మా ఆడవారిని ముట్టుకుంటావా? నీకెంత ధైర్యం? మా వారికి మా అగ్రవర్ణ వైద్యులే చేయాలి. వెంటనే వారిని పిలించాలి.. ’ అని గొడవ చేశారు. ఇదెక్కడి చోద్యమని గీతేశ్ వారిని ప్రశ్నించాడు. దీంతో మహిళల బంధువులు పదిహేను మంది అతనిపై దాడి  చేశారు. నెత్తురోడుతున్న మహిళలను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిపోయారు. గీతేశ్ వారిపై అట్రాసిటీ కేసు పెట్టాడు.