కన్నీరు పెట్టించిన కుక్క.. మనుషుల కంటే గ్రేట్ - MicTv.in - Telugu News
mictv telugu

కన్నీరు పెట్టించిన కుక్క.. మనుషుల కంటే గ్రేట్

September 16, 2019

Dog In Karnataka.

సాటి మనిషి ప్రమాదంలో ఉంటే కనీసం పట్టించుకోని ఈ రోజుల్లో నోరులేని మూగజీవాలు మాత్రం మానవుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదంలో చనిపోయిన ఓ కుక్క వద్దకు వచ్చిన మరో శునకం దాన్ని లేపేందుకు ఎంతో ప్రయత్నించింది. తిరిగిరాలేదని తెలిసి కూడా చేతనైనకాడికి ప్రయత్నించింది. కర్నాటకలో జరిగిన ఈ ఘటన అక్కడనున్న వారందరిని కన్నీళ్లు పెట్టించింది. 

రామనగర్ శివారుల్లో వాహనం ఢీకొని ఓ కుక్క మరణించింది. అక్కడ ఉన్న మరో శునకం ఈ ఘటన చూసి కన్నీరుపెట్టుకుంది. తనతోపాటు తిరిగిన దోస్తులేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. దాన్ని అటూ ఇటూ కదుపుతూ లేపేందుకు ప్రయత్నించింది. దాని వద్దకు ఎవరిని రానివ్వకుండా రోదించింది. ఎంతసేపటికి ఆ కుక్కలేవకపోవడంతో కొద్దిసేపు అక్కడే రోధించి చేసేదేమిలేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికులు కుక్క మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.