ఓ యువతి బాధతో ఉందో లేదా పరధ్యానంగా ఉందో తెలీదు కానీ, ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో ఓ కుక్క వచ్చి యువతిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెపై మూత్ర విసర్జన చేసి వెళ్లిపోయింది. వెనుక ఏదో తడిగా అనిపించి చూసిన యువతికి కుక్క చేసిన పని అర్ధమైంది. కానీ, ఏం చేయగలదు.
కుక్కను చూసి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఈ దృష్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలకు చిక్కాయి. దీంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కుక్క యువతిని విగ్రహం అనుకుందని ఒకరు, వెనక నుంచి పోస్తే ఏం కాదులే అనే ధైర్యం అని మరొకరు ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిది అన్న సమాచారం మాత్రం లభ్యం కాలేదు.
Here, let me comfort you😂 pic.twitter.com/oGaMZ6915q
— Animals Being Jerks (@Animalbelngjerk) May 18, 2022