ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైంది. యమునా ఎక్స్‌ప్రెస్ వేలోని మైల్ స్టోన్ 88వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దాదాపు 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి 12 గంటలకు జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.
मथुरा में यमुना एक्सप्रेस वे पर हादसा, बस पलटने से 3 की मौत, 22 घायल, 6 बस सवार की हालत गंभीर, दिल्ली से बिहार आ रही थी बस, समस्तीपुर, दरभंगा के लोग थे सवार @mathurapolice @Uppolice@IndiaNewsUP_UK #MathuraBusAccident #Mathura pic.twitter.com/xuqFxuGifD
— Arun Azad Chahal 🇮🇳 (@arunchahalitv) February 27, 2023
శివప్రకాష్ ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రయాణికులతో బీహార్‌కు వెళ్తోంది. మైల్ స్టోన్ 88 సమీపంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్స్‌ప్రెస్‌వే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు ప్రయాణికులు మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ నరేంద్ర యాదవ్ తెలిపారు. 20 మంది గాయపడ్డారని అందులో కొందరి ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరణించిన ప్రయాణికులను ఇంకా గుర్తించలేదన్నారు. డీఎం పుల్కిత్ ఖరే, ఎస్‌ఎస్పీ శైలేష్ పాండే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేశారు.