వాహనాలతో రిస్క్ చేయడం అంటే ప్రాణాలను గాల్లో దీపంలా ఉంచడమే. ఏమాత్రం అటు ఇటూ అయినా భూమ్మీద నూకలు చెల్లిపోతాయి. ఇలా చాలా మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కొందరు భయపడి మనకెందుకులే రిస్క్ అని వెనకడుగే వేస్తే.. మరికొందరు సాహసికులు మాత్రం స్టంట్స్ చేయడాన్ని అలవాటుగా పెట్టుకుంటారు. వాటిని విజయవంతంగా పూర్తి చేసి అందులో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాంటి రిస్కీ స్టంట్ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారుతో ఎదురుగా కొండలా ఉన్న మట్టి దిబ్బపైకి సునాయాసంగా వెళ్లి టార్గెట్ పూర్తి చేస్తాడు. చూసేవారికి ఏమాత్రం పట్టు తప్పినా పెను ప్రమాదం తప్పదని అనిపిస్తుంది. కానీ సదరు వ్యక్తి మాత్రం కారును తన నైపుణ్యంతో ఏమాత్రం పట్టు తప్పకుండా బయటికి తీసుకువస్తాడు. ఇన్‌స్టాగ్రాంలో వాంగ్డింగ్ మాన్ అకౌంటులో పోస్ట్ చేసిన ఈ వీడియోకి వన్ మిలియన్ లైకులు వచ్చాయి. మొత్తం 7 వేల కామెంట్లతో వైరల్ అవుతోంది. వీడియోను చూస్తే విదేశాల్లో జరిగినట్టుగా తెలుస్తోంది.