పాకిస్తాన్ హనీట్రాప్ లో చిరుద్యోగి.. పట్టుకున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్ హనీట్రాప్ లో చిరుద్యోగి.. పట్టుకున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

November 18, 2022

యుద్ధాలు చేసి భారత్ దేశంతో గెలవలేమని భావించిన పాకిస్తాన్.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. అది కూడా పూర్తిస్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో అందమైన అమ్మాయిలను ఎరగా వేసి కీలక విభాగాల్లో పని చేసే ఉద్యోగుల నుంచి కీలకమైన దేశ రహస్యాలను తెలుసుకుంటోంది. ఇప్పటివరకు కేవలం అమ్మాయిలనే వాడుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దాంతో పాటు డబ్బులను కూడా ఆఫర్ చేస్తోంది.

ఇలాంటి వ్యవహారాలు గతంలో వెలుగు చూసినా హనీట్రాప్ బాధితులంతా ఉన్నతాధికారులే ఉన్నారు. కానీ తాజాగా నిఘా వర్గాలు పసిగట్టిన ఉదంతంలో ట్రాప్ లో చిక్కుకున్న వ్యక్తి ఓ డ్రైవర్ కావడం విశేసం. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లోని విదేశీ వ్యవహారాల శాఖలో డ్రైవరుగా పని చేసే వ్యక్తికి పాకిస్తాన్ కు చెందిన ఓ యువతి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా పరిచయమైంది. తొలుత పూనమ్ శర్మగా, తర్వాత పూజ పేరుతో ముగ్గులోని దింపింది. పెళ్లి చేసుకుందామని ఉచ్చులోకి లాగి పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాక.. డబ్బులిస్తానని ప్రలోభ పెట్టడంతో సదరు డ్రైవరు కొన్ని కీలక పత్రాలను అందించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం డ్రైవరుని అదుపులోకి తీసుకొని ఏఏ వివరాలు, పత్రాలు పంపాడో విచారణ చేస్తున్నాయి.