మద్యం మనుషులకే కాదు. జంతువులు, పక్షులకు కూడా నిషా ఇస్తుంది. కావాలంటే ఈ వీడియో చూడండి. మద్యం మత్తులో ఈ పక్షి నడక నవ్వు తెప్పిస్తుంది. అదే సమయంలో వేరే జీవికి ఆహారమైపోతేందేమోనని జాలి కలుగుతుంది. హ్యాంగోవర్లో ఉన్న ఈ పక్షి సరిగ్గా నడవలేక అటూ ఇటూ తూలుతూ పడిపోతోంది. ఈ వీడియో పాతదైనా సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగులో వచ్చింది. వీడియోలో ఘటన గురించి వివరణ ఇలా ఉంది. ‘నార్వే దేశంలోని టెలెమార్క్ అక్కెర్ హాగెన్ ప్రాంతంలో ఆపిల్ తోటకు చెందిన వీడియో ఇది. తోటలో కింద రాలి పడి పులిసిపోయిన ఆపిల్ పండ్లను ఈ మాగ్పీ అనే పక్షి తిన్నది. దానివల్ల మత్తు వచ్చింది. అది తెలియక తిన్న మత్తు ఎక్కడంతో సరిగ్గా నడవలేకపోతోంది. ఇలాగైతే ఇతర ప్రాణులకు ఆహారమైపోతుంది. అలా జరుగకూడదని కోరుకుందాం’ అని ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మంది చూశారు. అలాగే మీకెప్పుడైనా ఇలాంటి దృష్యాలు కనపడ్డాయా? అన్నది కామెంట్ చేసి తెలియజేయండి.
Magpie ate too many fermenting apples and got drunk. from interestingasfuck