రైలు లోకో డ్రైవర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చే క్రమంలో ఎంతో ఒత్తిడికి గురవుతారు. 12 గంటల పాటు సాగే వారి షిఫ్ట్ డ్యూటీలో రైలును నడుపుతూ ట్రాక్ దాటుతున్న వారి భద్రత చూసుకుంటూ, వారి కోసం హారన్ లు కొడుతూ అలసిపోతుంటారు. ఈ క్రమంలో ఎవరైనా ఇబ్బంది పెడితే సహనం కోల్పోతారు. తాజాగా ఈ కోవకు వచ్చే ఘటన జరిగింది. ఓ తాగుబోతు రైలు డ్రైవరు సహనానికి పరీక్ష పెడుతూ రన్నింగ్ రైలుకు అడ్డంగా వచ్చాడు. పట్టాలపై నడుస్తూ ఎదురుగా వస్తున్న రైలు లోకో పైలట్ కి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చాడు.
सोशल मीडिया पर ये वीडियो वायरल हो रहा है जहां ये व्यक्ति पटरी पर आकर चलती ट्रेन को रोकता है।
फिर ट्रेन चालक ट्रेन से उतर कर इस व्यक्ति के कान और गाल थप्पड़ से गर्म कर देता है। pic.twitter.com/niKlSVCn2X
— Shubhankar Mishra (@shubhankrmishra) December 26, 2022
ఎంత హారన్ కొట్టినా పట్టాల నుంచి తప్పుకోకపోవడంతో రైలును స్లో చేయాల్సి వచ్చింది. రైలు స్పీడు తగ్గగానే తాగుబోతు వ్యక్తి పట్టాలను దిగి పక్కకు వెళ్లిపోయాడు. దీంతో చిర్రెత్తిన లోకో పైలట్ రైలును ఆపేసి కిందకు దిగి తాగుబోతు వైపు ఆగ్రహంతో కదిలాడు. తాగుబోతును వెనుక నుంచి తల మీద బలంగా కొట్టాడు. దాంతో తాగుబోతు ముందుకు తూలి వెళ్లకిలా పడ్డాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిలియన్ల వ్యూస్ వచ్చిన ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కచ్చితంగా ఇండియాలోనే అని మాత్రం చెప్పవచ్చు.