A drunken woman teacher gives lessons..and then commits suicide
mictv telugu

మద్యం తాగి మహిళ టీచర్ పాఠాలు..ఆపై ఆత్మహత్య హంగామా

September 9, 2022

పిల్లలకు బుద్దిగా పాఠాలు చెప్పి, వారి భవిష్యత్తును బంగారుబాటలో నడపాల్సిన ఓ మహిళ టీచర్ ప్రతి రోజు మద్యం సేవించి, విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు తాలూకా చిక్క సారంగి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. మద్యం సేవిస్తున్న విషయం బయటపడడంతో ఆ టీచర్ ఆగ్రహంతో రగిలిపోయి, ఆత్మహత్య చేసుకొంటానని హంగామా సృష్టించింది. చివరికి విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే..తుమకూరు తాలూకా చిక్క సారంగి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా గంగ లక్ష్మమ్మ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే మద్యం సేవించి, పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. పాతికేళ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తుస్తూ, గత అయిదేళ్లుగా మద్యానికి బానిస అయ్యారు. నిత్యం మద్యం సేవించి, విద్యార్ధులను ఎలాంటి కారణం లేకుండానే వారిని కొట్టడం, తిట్టడం, సహ ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగటం మొదలపెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకి వచ్చి టీచర్‌ను నిలదీశారు.

అనంతరం ఎంతచెప్పిన వినకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు.. పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయినికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తాలూకా విద్యాధికారి (బీఇవో) హనుమానాయక్ పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయిని టేబుల్ డ్రాను పరిశీలించడానికి ప్రయత్నించగా, ఆమె అడ్డుకున్నారు. గ్రామస్థులు టేబుల్ డ్రాకు తాళాలు విరగగొట్టి చూడగా అందులో ఓ మద్యం సీసా, మరో రెండు ఖాళీ సీసాలు లభించాయి. విషయం బయటపడడంతో గంగ లక్ష్మమ్మ తీవ్ర ఆగ్రహంతో తన గదిలోకి వెళ్లి, తాళాలు వేసుకుని ఆత్మహత్య చేసుకొంటానని హంగామా చేసింది.