A easy t target ahead of England
mictv telugu

టీ20 ఫైనల్..ఇంగ్లాండ్ ముందు ఊరించే టార్గెట్

November 13, 2022

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగారు. పాకిస్థాన్‎ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‎కు వచ్చిన పాక్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. బాబర్ ఆజామ్ (32), మసూద్ (38) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు తీయగా..అదిల్ రషీద్ 2, జోర్డన్ 2, స్టోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. పాక్ బ్యాట్స్ మెన్‌‌కు ఎక్కడా ఇంగ్లాండ్ బౌలర్లు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. ఐదో వికెట్‌కు మసూద్, షాదాబ్ ఖాన్(20) 36 పరుగుల చేసి మంచి భాగస్వామ్యం అందించిన చివరిలో పాక్ బ్యాట్స్ మెన్స్ తేలిపోయారు. కేవలం చివరి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే రాబట్టగలిగారు.