నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బింబిసార’ ప్రిరిలీజ్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాదులో జరిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్లో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మృతుడిని తాడేపల్లిగూడెంకు చెందిన సాయిరాంగా గుర్తించారు. కూకట్‌పల్లిలో ఉంటూ ప్రైవేటుగా జాబ్ చేసుకునే సాయిరాం అనుమానాస్పద రీతిలో మరణించడం నందమూరి ఫ్యాన్స్‌ను విషాదంలో నెట్టింది. మృతదేహాన్ని ప్రస్తుతం పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నట్టు తెలిపారు. అటు ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి పాజిటివ్‌గా మాట్లాడడంతో ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆగస్టు 5న రిలీజయ్యే ఈ చిత్రం బిజినెస్ ఎన్టీఆర్ వ్యాఖ్యల వల్ల మరింత పెరిగిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.