సుత్తెతో కేజీఎఫ్ సినిమాకు వచ్చిన అభిమాని - MicTv.in - Telugu News
mictv telugu

సుత్తెతో కేజీఎఫ్ సినిమాకు వచ్చిన అభిమాని

April 14, 2022

 

rrrrrrrrrrrr

‘కేజీఎఫ్ ఛాపర్ట్ 2’ గురువారం దేశవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాను చూడటం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యశ్ అభిమానుల కల తీరింది. సినిమాలో హీరో యశ్ చెప్పే డైలాగులకు, యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాను వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు.. సినిమా సూపర్‌గా ఉందని, ‘కేజీఎఫ్ పార్ట్ 1’తో పోలిస్తే, పార్ట్ 2 చాలా బాగుంది అని, హీరో చివర్లో మరణించే సీన్ అందరినీ ఏడిపించిదని, అదే సినిమాకు హైలెట్‌ అని చెప్తున్నారు. కానీ, ఇవేవి చెప్పకుండా ఓ అభిమాని మాత్రం సుత్తెతో సినిమా థియేటర్‌కు వచ్చి హంగామా చేసిన సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

తన అభిమాన హీరో ఎలా హెయిర్ కట్టింగ్ చేయించుకుంటే అలా హెయిర్ కట్టింగ్ చేయించుకోనేవారిని చూశాం, హీరో ఎలాంటి డ్రెస్ వేసుకుంటే అలాంటి డ్రెస్ వేసుకోనేవారిని చూశాం. కానీ, తమ అభిమాన హీరో నటించిన క్యారెక్టర్‌లో ఎలాంటి వేషధారణ ఉందో సరిగ్గా అలాంటి వేషధారణతోనే ఓ అభిమాని సినిమా థియేటర్స్‌కు వచ్చి సందడి చేశాడు. ముఖానికి రక్తం రంగు పూసుకుని, చేతిలో సుత్తెను పట్టుకుని థియేటర్ ముందు కుర్చొని హంగామా చేశాడు. దీంతో అక్కడున్న కొంతమంది అతడు చెప్పే డైలాగులను, సుత్తెను పట్టుకుని చేస్తున్న సాహసాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. దీంతో తెగ వైరల్ అవుతున్నాయి.