కండోమ్ తెచ్చివ్వాలా.. మహిళా ఐఏఎస్ అధికారి అసభ్య వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

కండోమ్ తెచ్చివ్వాలా.. మహిళా ఐఏఎస్ అధికారి అసభ్య వ్యాఖ్యలు

September 28, 2022

విద్యార్ధినుల పట్ల ఓ మహిళా ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీహార్ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న హర్జోత్ కౌర్ భమ్రా ఓ వర్క్‌షాపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్ధిని 20, 30 రూపాయలకు ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వగలదా? అని ప్రశ్నించగా ‘అవిస్తే రేపు జీన్స్ ఇవ్వండి అంటారు.

తర్వాత మంచి బూట్లు అడుగుతారు. ఇంతటితో ఆగుతారా.. తర్వాత కండోమ్‌లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేస్తారు’ అని ఫైర్ అయ్యింది. దీనికి మరో విద్యార్ధిని ప్రజల ఓట్లతోనే కదా ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది అని అంటే, అయితే ఓటు వేయకండి. మొత్తం పాకిస్తాన్‌లా మార్చేయండి, డబ్బుకు ఓటు వేయకుండా ఉండండి అంటూ బదులిచ్చారు. కొన్ని విషయాలు అడగవద్దని, మనకేమైనా కావాలంటే కష్టపడి సంపాదించుకోవాలని సూచించింది. ఈ కార్యక్రమం యునిసెఫ్‌తో పాటు మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో జరిగింది.