A female patient asked Prime Minister Rishi Sunak to raise the salaries of nurses
mictv telugu

రిషి సునాక్‌కి ఊహించని అనుభవం.. దిమ్మతిరిగే ఆన్సరిచ్చిన పేషెంట్

October 29, 2022

భారతీయ మూలాలున్న బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌కి ఊహించని అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు ఆయన సౌత్ లండన్‌లోని క్రొయిడన్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఓ మహిళా పేషేంటుని అడుగగా, ఆమె నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ‘బాగా చూసుకుంటున్నారు. కానీ వారికిచ్చే జీతాలు చూస్తే జాలేస్తుంది. దయచేసి నర్సుల జీతాలు పెంచండి’ అని ఆమె విన్నవించింది. దానికి రిషి.. తప్పకుండా.. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పేలోపే ఆమె అందుకొని.. ‘మీరు మామూలుగా ప్రయత్నించడం కాదు. మరింత గట్టిగా దీనిపై ప్రయత్నించాల్సిన అవసరం ఉంద’ని గట్టిగా చెప్పడంతో రిషి ఒకింత ఆశ్చర్యపోయారు. ‘మీ మాటలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాను’ అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, 1948 నుంచి బ్రిటన్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రభుత్వం కూడా సేవల మీద ఖర్చుచేసే నిధుల్లో మూడింట ఒకవంతు ఆరోగ్య సేవల మీదే ఖర్చు చేస్తుంది. అయితే ధరలు పెరిగిపోవడంతో జీతాలు సరిపోని పరిస్థితి. దీంతో 3 లక్షల మంది నర్సులు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నారు. అంతేకాక, దాని కోసం ఓటింగ్ నిర్వహించారు. 106 ఏళ్ల చరిత్రలో ఇలా ఓటింగ్ నిర్వహించడం ఇదే ప్రథమం. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జీతాల్లో పెరుగుదల లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెల్లడించింది.