A female teacher having a massage with a student
mictv telugu

స్టూడెంట్‌తో మసాజ్ చేయించుకున్న మహిళా టీచర్.. వీడియో వైరల్

July 28, 2022

పాఠాలు చెప్పే గురువుకి మర్యాదతో దండాలు పెట్టే ఈ సమాజంలో కొందరు చేస్తున్న పని ఆ వృత్తికి కళంకం తెస్తోంది. బదిలీపై వెళ్లే టీచర్లను చూసి పిల్లలు ఏడుస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో వెకిలిచేష్టలతో గురువు స్థానాన్ని దిగజార్చే టీచర్లను కూడా చూస్తున్నాం. పిల్లలకు చదువు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్.. క్లాస్ రూంలోనే విద్యార్ధితో మసాజ్ చేయించుకుంది. వివాదాస్పదమైన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. వీడియో ప్రకారం.. హర్దోయి ప్రభుత్వ పాఠశాలలో ఉర్మిలా సింగ్ అనే మహిళ అసిస్టెంట్ టీచరుగా పని చేస్తోంది. ఈ క్రమంలో తరగతి గదిలోనే ఓ స్టూడెంట్‌తో చేతులు పట్టించుకుంది. తను మాత్రం హాయిగా కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతున్న వీడియో అక్కడ వైరల్ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా వీడియో మా దృష్టికి వచ్చిందనీ, ఆమెపై శాఖాపరమైన చర్యలుంటాయని విద్యాధికారి బీపీ సింగ్ వెల్లడించారు. అటు పిల్లల తల్లిదండ్రులు ఆమెను పాఠశాల నుంచి తొలగిస్తేనే పిల్లలను బడికి పంపుతామని ధర్మా చేశారు.