A first at Chennai institute of mental health: A marriage between inmates
mictv telugu

పిచ్చాసుపత్రి కలిపింది ఆ ఇద్దరిని.. పేషెంట్లుగా వెళ్లి పెళ్లి..

October 28, 2022

 

మెంటల్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఆ ఇద్దరు.. కొద్దికాలంలోనే కోలుకొని పెళ్లిచేసుకోబోతున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన మహేంద్రన్(42).. కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాల కారణాలతో డిప్రెషన్‌కి లోనయ్యాడు. మానసికంగా డిప్రెషన్‌కి లోనవ్వడంతో రెండేళ్ల క్రితం చికిత్స కోసం చెనైలోని కల్పకం మెంటల్ హాస్పిటల్ కు వెళ్లాడు. ఆరోగ్యం మెరుగయ్యాక.. అక్కడే కేర్ సెంటర్‌లో పని చేశాడు. అదే సమయంలో వెల్లూరుకు చెందిన దీప(36) అనే మహిళ మానసిక సమస్యలతో అక్కడికి వచ్చింది. తండ్రి చనిపోవడంతో కుంగుబాటుకి గురైన ఆమెకు కేర్ టేకర్ గా ఆమె ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద తీసుకున్నాడు మహేంద్రన్. ఈ క్రమంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. మనసులోని మాట చెప్పడంతో ఆమె కూడా ఒప్పుకుందట

మహేంద్రన్ పరిచయం పెళ్లి వరకు తీసుకెళ్లిందని, తనకసలు ఈ జీవితంలో పెళ్లి జరుగుతుందని కలలో సైతం అనుకోలేదని చెబుతోంది దీప. వారిద్దరూ పూర్తిగా కోలుకున్న తర్వాతే, వారి కోరిక మేరకు పెళ్లికి అనుమతి ఇచ్చామని కల్పకం ప్రభుత్వ మానసిక వైద్యశాల డాక్టర్ సంగీత తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ఇదే మానసిక ఆసుపత్రి ఆశ్రమంలో పనిచేస్తున్నారు. వారి కోసం అక్కడి కార్మికులు, స్నేహితులు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే వెట్రి అళగన్‌ అధ్వర్యంలో ఆస్పత్రిలోనే వీరి వివాహం జరగనుంది.